ETV Bharat / city

పునఃప్రారంభమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రక్రియ - telangana news

తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతలు మళ్లీ మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాసంగి అవసరాలకు గోదావరి జలాల తరలింపు పునఃప్రారంభమైంది. ఎత్తిపోతల కార్యక్రమం తొలిరోజు నిరాటంకంగా సాగింది.

Kaleshwaram
కాళేశ్వరం ఎత్తిపోతలు
author img

By

Published : Jan 18, 2021, 11:49 AM IST

Updated : Jan 18, 2021, 12:26 PM IST

కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు ఆదివారం పునఃప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో యాసంగి అవసరాలకు గోదావరి జలాల తరలింపు మొదలైంది. ప్రాజెక్టు లింక్‌-1లోని కన్నెపల్లి(లక్ష్మీ), సిరిపురం, గోలివాడ పంపుహౌస్‌లలో రెండు మోటార్ల చొప్పున, లింక్‌-2లోని ఆరో ప్యాకేజీ నందిమేడారంలోని నంది పంపుహౌస్‌.. అలాగే ఎనిమిదో ప్యాకేజీలోని గాయత్రి పంపుహౌస్‌లో ఒక్కో మోటారు వంతున నడిపిస్తూ మధ్యమానేరు జలాశయానికి నీటిని తరలిస్తున్నారు.

తొలిరోజు నిరాటంకంగా...

లింక్‌-1లోని మూడు పంపుహౌస్‌లలో 5,200 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోస్తుండగా, అక్కడి నుంచి 3,150 క్యూసెక్కుల చొప్పున నందిమేడారం చెరువులోకి, దాని నుంచి అంతే మొత్తంలో గాయత్రి పంపుహౌస్‌కు వదిలారు. గాయత్రి పంపుహౌస్‌లో ఒక మోటారుతో ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎత్తిపోస్తుండగా శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) జలాశయానికి చేరుతోంది. దీని నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు జలాశయానికి వదిలారు. ఎత్తిపోతల కార్యక్రమం తొలిరోజు నిరాటంకంగా సాగింది.

అధికారుల పర్యవేక్షణ

దిగువ మానేరు జలాశయానికి 10 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 2.5 టీఎంసీల నీరు చేరే వరకు ఎత్తిపోతలు కొనసాగుతాయని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్‌ఈలు, ఈఈలతో కలిసి ఎత్తిపోతల ప్రక్రియను ఆదివారం పర్యవేక్షించారు.

ఇదీ చదవండి:

గ్రామ ఉజాలా’కు కృష్ణా జిల్లా ఎంపిక

Last Updated : Jan 18, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.