ETV Bharat / city

'రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది'

author img

By

Published : Apr 12, 2020, 10:42 PM IST

రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు... జాతీయ మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాశారు. వైకాపా నేతలు రాజకీయ లబ్ధికోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని లేఖలో ఆరోపించారు.

kala-venkatrao-letter-to-nhrc
kala-venkatrao-letter-to-nhrc

ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. దీనిపై మానవహక్కుల కమిషన్​కు లేఖ రాశారు. వైకాపా నేతలు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని... ఎంపీ విజయసాయిరెడ్డి వందల మందితో కలిసి పర్యటిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. కొత్తగా నియమితులైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కనగరాజ్‌ తమిళనాడు నుంచి ఏపీకి వచ్చారన్న కళా... వారికి క్వారంటైన్‌ నిబంధనలు వర్తింప చేయలేదని వివరించారు.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి వందమంది కార్యకర్తలను వెంటపెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తూ నిబంధనలను ఉల్లంఘించారని లేఖలో పేర్కొన్నారు. నగదు, సరకులు పంపిణీ పేరుతో కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపించారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి.... ప్రభుత్వం పీపీఈలు పంపిణీ చేయడం లేదని ఆరోపించారు.

ఇవీ చదవండి: కరోనా ఉగ్రరూపం: ఐరోపాలో 75 వేలు దాటిన మరణాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.