జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్‌రెడ్డి బెంచ్.. తీర్పును ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. జడ్జి రామకృష్ణ ఫోన్ పోయిందని ప్రతివాది తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కస్టడీకి తీసుకున్నప్పుడు ఫోన్ పోయిందని పోలీసులు చెప్పారని వెల్లడించారు. ఫోన్ చోరీకి కోర్టులోని కేసుకు సంబంధం లేదని జస్టిస్ అశోక్ భూషణ్ స్పష్టం చేశారు. ఫోన్ చోరీ అంశంలో చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఫోన్ చోరీకి గురైందన్న అంశంపై వేసిన అప్లికేషన్ వ్యాజ్యాన్ని బెంచ్ తిరస్కరించింది. ఈనెల 12న తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
సస్పెండయిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్యల మధ్య సంభాషణ కేసు తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వారి సంభాషణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కుట్రకు పథకం పన్నినట్లు స్పష్టమవుతున్నందున.. వాస్తవాల నిర్ధారణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్‌తో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే కోరుతూ జస్టిస్ ఈశ్వరయ్య సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇదీ చదవండి: