ETV Bharat / city

జస్టిస్‌ ఆరూప్ గోస్వామి నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆరూప్ కుమార్ గోస్వామి వార్తలు

జస్టిస్‌ ఆరూప్ కుమార్ గోస్వామి నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టాలని నోటిఫికేషన్‌లో కోరింది.

justice aroop kumar swamy appointed as ap high court cj

author img

By

Published : Jan 2, 2021, 12:03 PM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆరూప్ గోస్వామి నియామకమయ్యారు. సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం మేరకు సిక్కిం హైకోర్టు నుంచి బదిలీ అయ్యారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆయన నియామకాన్ని నోటిఫై చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

సిక్కిం నుంచి జస్టిస్‌ గోస్వామి..

1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించిన జస్టిస్‌ గోస్వామి 1985లో గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1985 ఆగస్టు 16న న్యాయవాదిగా నమోదయ్యారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్‌ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

ఇదీ చదవండి:

రామతీర్థం చుట్టూ రాజకీయం.. విగ్రహ ధ్వంసం ఘటనాస్థలానికి నేడు అగ్ర నేతలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.