ETV Bharat / city

Junior Artist Died :స్టేషన్ వచ్చిందనుకుని రైలు దిగింది...కాదని తెలిసి ఎక్కుతుండగా... - జూనియర్ ఆర్టిస్టు

Woman died in Train Accident: కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడిన మహిళ తీవ్రగాయాలకు గురై మరణించిన సంఘటన తెలంగాణలోని షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. మృతురాలు ఏపీలోని కడప వాసిగా పోలీసులు గుర్తించారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ఉద్యోగిగా చేస్తూ.. జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోందని వెల్లడించారు.

Junior Artist Died
కదులుతున్న రైలు ఎక్కబోయి కింద పడి మహిళ మృతి
author img

By

Published : Jan 19, 2022, 12:34 PM IST

Junior Artist Died : కడప జిల్లా కేంద్రంలోని సినిమా స్ట్రీట్‌కు చెందిన జ్యోతిరెడ్డి(28) హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగా, జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. పండుగ నిమిత్తం సొంత ఊరికి వెళ్లిన ఆమె సోమవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యింది. మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్‌నగర్‌లో ఆగింది. అయితే కాచిగూడ అని భావించి రైలు దిగింది. తాను దిగిన స్టేషన్ కాచిగూడ కాదని తెలుసుకుని తిరిగి ఎక్కేందుకు ప్రయత్నించింది.

అప్పటికే రైలు కదులుతుండటంతో అదుపుతప్పి కిందపడి గాయపడింది. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇది రైల్వేవారి నిర్లక్ష్యమంటూ జూనియర్‌ ఆర్టిస్టులు ఆసుపత్రి ముందు కొంతసేపు ఆందోళన చేశారు.

ఇదీ చూడండి: young man suicide: కరోనా భయంతో యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.