ETV Bharat / city

'రైల్వే అప్రెంటిస్‌ పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయాలి' - దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ నోటిఫికేషన్-2019

దక్షిణ మధ్య రైల్వే ఇటీవల 4,103 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. వీటికి దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానించింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులు నష్టపోతారని లోక్​సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ గళమెత్తారు. స్థానికులతోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

galla jayadev
గల్లా జయదేవ్
author img

By

Published : Dec 12, 2019, 9:07 PM IST

రైల్వేల్లో అప్రెంటిస్‌ పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయాలని తెదేపా పార్లమెంటరీ నేత గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. 4 వేలకు పైగా అప్రెంటిస్​ల భర్తీకి ఇటీవల దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొనడాన్ని జయదేవ్‌ లోక్​సభలో ప్రస్తావించారు. శూన్యగంటలో ఈ విషయాన్ని లేవనెత్తిన ఎంపీ.. దేశంలో ప్రతి రైల్వేజోన్‌లో స్థానికులనే అప్రెంటిస్‌ ఉద్యోగాల్లో తీసుకుంటారని వివరించారు. అలాంటిది ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే ఇచ్చిన ఈ అవకాశంతో స్థానిక నిరుద్యోగులు అన్యాయమైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని కొనసాగిస్తే... త్వరలో భర్తీ చేయబోయే 14 వేల ఖాళీలను ఇతరులు తన్నుకుపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అందులో కూడా 20 శాతం పోస్టులు అప్రెంటిస్‌లకే ఉంటాయి కాబట్టి.. తెలుగు రాష్ట్రాల వారు నష్టపోతారని కేంద్రం దృష్టికి తెచ్చారు. దక్షిణ మధ్య రైల్వేలోని అప్రెంటిస్‌ పోస్టులను బయటి వారితో భర్తీ చేస్తే.. రెగ్యులర్ నియామకాల్లో కూడా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకుని స్థానికులతోనే అన్ని పోస్టులూ భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలని గల్లా జయదేవ్‌ డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'జగన్‌ ఒక నియంత... సభాపతి, మంత్రులు డమ్మీలుగా మారారు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.