ETV Bharat / city

PAWAN KALYAN PROTEST : 'ఉక్కు పరిరక్షణ దీక్ష'కు సిద్ధమైన.. పవన్ కల్యాణ్‌

Pawan Kalyan Protest : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం మంగళగిరిలో 'ఉక్కు పరిరక్షణ దీక్ష' చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము పోరాడతామని స్పష్టం చేసిన పవన్.. ఈ అంశంపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
author img

By

Published : Dec 10, 2021, 7:05 PM IST

విశాఖ ఉక్కు కార్మికుల పరిరక్షణకు సంఘీభావంగా... ఈనెల 12న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిరాహారదీక్ష చేయనున్నారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని పవన్‌ విమర్శించారు. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకువెళ్లాలని విశాఖ సభలో అల్టిమేటం ఇచ్చినా.. ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ అంశంపై తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందన్న జనసేనాని.. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలను దిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు 300 రోజులుగా నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారని, వారికి నైతిక మద్దతు కొనసాగింపులో భాగంగా.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నిరాహార దీక్ష జరుగుతుందని జనసేన పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్​తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

విశాఖ సభలో పవన్...
Pawan Kalyan Protest : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవల జనసేన తలపెట్టిన సభలో.. అధికార పార్టీ వైకాపాపై పవన్ నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న జనసేన అధినేత.. ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేస్తుంటే వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీ, కాఫీలు తాగడానికే పార్లమెంట్ కు వెళ్తున్నారా? అని నిలదీశారు. విశాఖ ఉక్కు కార్మగారం ఎవరి భిక్షవల్లో రాలేదని.. అది ఆత్మబలిదానాలతో సాధించుకున్న పరిశ్రమ అని పవన్ అన్నారు. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' నినాదంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించారు.

ఎందుకు మద్దతిస్తున్నారు..
Pawan Kalyan Protest : అన్నింటికీ ఉన్నట్లే విశాఖ ఉక్కు పరిశ్రమకూ నష్టాలు ఉన్నాయి.. ఒక్క వైకాపా రాజకీయ పరిశ్రమకు తప్ప అని పవన్ ఎద్దేవా చేశారు. మన ఎంపీలు ఎందుకు అడగలేదు? కార్మికుల కష్టాలు కేంద్రంలోని పెద్దలకు ఎలా తెలుస్తాయని పవన్ అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు ఇవ్వాలని మనవాళ్లు ఎందుకు అడగటం లేదని నిలదీశారు. కేప్టివ్ మైన్స్ ఇవ్వాలని మన ఎంపీలు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు.

కేంద్రం తెచ్చిన అనేక బిల్లులకు వైకాపా ఎంపీలు మద్దతిచ్చారని గుర్తు చేసిన పవన్.. కేంద్రానికి మద్దతిచ్చే వేళ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అలాంటప్పుడు వైకాపా నేతలు కేంద్రానికి ఎందుకు మద్దతిస్తున్నారని పవన్ నిలదీశారు. వైకాపా నేతలకు ప్రజల కష్టాలు తెలియవన్నారు. వైకాపా నేతలకు తెలిసింది.. కాంట్రాక్టులు, పదవులు, సారా డబ్బులేనని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు కోసం వైకాపా నేతలు ఏం చేశారో చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఇలాంటప్పుడు 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉండి ఏం ఉపయోగమని ప్రశ్నించారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.