కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ.. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన వీర మహిళా విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది.
పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచనల మేరకు మహిళా నేతలు వారి వారి ఇళ్లలో దీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వమే పరీక్షలను రద్దు చేసిందని.. జగన్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని మహిళా నేతలు హితవు పలికారు. హైకోర్టు చెప్పిన విధంగా పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: