దేవాదాయ ఆస్తులను అమ్మేయాలని చూస్తే భక్తుల ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందనే విషయం మరోమారు రుజువైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంత్రాలయం మఠానికి చెందిన భూముల వేలాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అందులో భాగమేనని ఓ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. భూముల అమ్మకం తాత్కాలికంగా నిలుపుదల చేయటాన్ని ఆయన స్వాగతించారు.
గతంలో తితిదే ఆస్తుల విషయంలోనూ భక్తుల నుంచి నిరసనల వల్లే ప్రభుత్వం వెనక్కి వెళ్ళిందన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నా... దేవుడి మాన్యాలను ఎందుకు కాపాడలేకపోతోందని ప్రశ్నించారు. పాలకుల జోక్యంతోనే ఆ మాన్యాలకు రక్షణ లేకుండా పోతోందని అనుమానం వ్యక్తం చేశారు. దేవాదాయ భూములు, ఆస్తులను అమ్మేసుకొనే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సదరు ఆస్తులను అమ్ముకొనే అధికారం పాలకులకు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి