ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసు.. విచారణ నేటికి వాయిదా - Jagan cases news

జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులకు సంబంధించిన ఛార్జిషీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ పిటిషన్​పై వాదనలు కొనసాగాయి. మరోవైపు ఓఎంసీ కేసు నుంచి తనను తొలగించాలని నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ కోర్టును కోరారు. పరకాలలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గతంలో నమోదైన కేసులో వైఎస్ విజయమ్మ, షర్మిళ ఈనెల 10న కచ్చితంగా హాజరుకావాలని ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టు ఆదేశించింది.

Jagan Illegal Cases hearings postponed to tomorrow
జగన్
author img

By

Published : Nov 3, 2020, 5:58 PM IST

Updated : Nov 4, 2020, 4:00 AM IST

జగతి పబ్లికేషన్స్​లో ముగ్గురు వ్యాపారుల నుంచి మోసపూరితంగా పెట్టుబడులు పెట్టించారన్న కేసు నుంచి తనను తొలగించాలని సీఎం జగన్ సీబీఐ న్యాయస్థానాన్ని కోరారు. డిశ్చార్జ్ పిటిషన్​పై జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదించారు. పెట్టుబడులు కంపెనీ చట్టాలకు అనుగుణంగా.. వ్యాపార కోణంలోనే జరిగాయని.. ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించారు. తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది.

జగన్ డిశ్చార్జ్ పిటిషన్​తో పాటు.. ఈడీ కేసులు ముందుగా విచారణ జరపాలన్న పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ.. నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఓఎంసీ కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ వాయిదా వేయాలని గనుల శాఖ మాజీ సంచాలకుడు, నిందితుడు వీడీ రాజగోపాల్ పిటిషన్ దాఖలు చేశారు.

పరకాలలో 2012లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న కేసులో ఈనెల 10న కచ్చితంగా హాజరుకావాలని వైఎస్ విజయమ్మ, షర్మిళ, కొండా సురేఖ, కొండా మురళిని నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ కోర్టు ఆదేశించింది. ఈనెల 10న కేసు విచారణ ప్రారంభిస్తామని నిందితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణంపై ఏసీబీ కోర్టులో సాక్షుల విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.

ఇదీ చదవండీ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు‌ ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు

Last Updated : Nov 4, 2020, 4:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.