జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో మంగళవారం 5 కేసులపై హైదరాబాద్లోని సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. సీబీఐ కోర్టు జడ్జి సెలవు, దసరా సెలవుల అనంతరం ఈ కేసుల విచారణ నేడు కొనసాగనుంది. జగతి పెట్టుబడులు, వాక్పిక్, రాంకీ, పెన్నా సిమెంట్స్, రఘురాం/ భారతి సిమెంట్స్ కేసులను విచారించనుంది.
సీబీఐ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన 6 కేసుల్లో అయిదింటిపై కూడా ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. వీటితో పాటు ఓబుళాపురం మైనింగ్ కేసు కూడా నేడు విచారణకు రానుంది.
ఇదీ చదవండి : ఆంక్షలున్నా...ఆగని బన్నీ ఉత్సవం