విశాఖలోని గంగవరం పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు సింగపూర్‌కు చెందిన ఏజీ అండ్ పీ సంస్థ ఆసక్తి కనబరుస్తోందని ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఎల్ఎన్జీ టెర్మినల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు సహజ వాయువు సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా మంత్రి తెలిపారు. అంతకుముందు మంత్రి మేకపాటితో సింగపూర్ ఎజీ అండ్ పీ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
పరిశ్రమలు, నగరాలలోని గృహ అవసరాలకు గ్యాస్ సరఫరా చేయడం కోసం 5,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3,500 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడెనిమిదేళ్లకు నాలుగు జిల్లాల్లో గ్యాస్ సరఫరా చేయనున్నట్లు ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఏజీ అండ్ పీ ప్రతినిధుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్యమంత్రితో చర్చిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి