రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్‌రెడ్డి దిల్లీలో నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్‌కాంత్‌ను కలిశారు. రాష్ట్రంలో డిజిటల్ సదస్సు నిర్వహణకు అమితాబ్ కాంత్ సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ గురించి ఆరా తీశారని... నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై వివరించామని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో రాబోయే 30 నైపుణ్య కళాశాలలకు సహకరించాలని కోరామన్నారు. అన్ని రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి