ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచస్థాయి నైపుణ్యాలు కలిగి ఉండేలా... సీఎం జగన్ కలలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు. జాతీయస్థాయి అప్రెంటిస్‌షిప్ అభివృద్ధి పథకానికి సంబంధించి విజయవాడలోని ఓ హాటల్లో నిర్వహించిన కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామిక వర్గాలకు అనుగుణంగా, నైపుణ్యాలను అందించేలా త్వరలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు, కళాశాలలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించే నైపుణ్యాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : ఫోన్ చేసి ఆమ్లేట్ కావాలన్నాడు... వెళ్తే కోరిక తీర్చమని వేధించాడు