గ్రామ సచివాలయాలు - పంచాయతీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పంచాయతీ ఉద్యోగులకు డీడీఓగా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి వ్యవహరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీఆర్వోకు బాధ్యతలు అప్పగిస్తూ గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు ఇచ్చారు.
ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారిగా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారే విధులు నిర్వహించారు. ఇక నుంచి పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. పంచాయతీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సెలవు మంజూరు కావాలంటే..
పంచాయతీ కార్యదర్శి మినహా..గ్రామ సచివాలంయలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సాధారణ సెలవులు కావాలంటే వీఆర్వో ద్వారానే దరఖాస్తు వెళ్లాలి. ఆయా శాఖల మండలాధికారులు పరిశీలించి ఆమోదిస్తేనే సెలవు మంజూరు అవుతుంది. కార్యదర్శులు, ఇతర సిబ్బందికి సెలవులిచ్చే అధికారాన్ని గ్రామ సర్పంచులకే అప్పగించింది.
ఇదీ చదవండి: