హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యూనిట్‌ను 2 వేల జీపీఎస్ డివైసెస్ తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్నామని సంస్థ సీఈవో కోణార్క్ తెలిపారు.
500 వరకూ ఉద్యోగాలు
ఈ ప్లాంట్ ద్వారా 500 వరకు ఉద్యోగాలు కల్పిస్తామని కోణార్క్ ప్రకటించారు. ప్లాంట్‌లో కృత్రిమ మేధ ఆధారిత జీపీఎస్ డివైసెస్ తయారు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక, ఖనిజాల తవ్వకం, ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతకు ఈ ఉత్పత్తులు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: