పెళ్లిపత్రికలు రకరకాలుగా రూపొందిస్తుంటారు. కొందరు విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో రైల్వేశాఖ ఉన్నతాధికారి శశికాంత్ మరికాస్త వైవిధ్యంగా ఆలోచించారు. పర్యావరణహితం, పచ్చదనాన్ని దృష్టిలో ఉంచుకొని తన వివాహానికి విత్తనాలు పొదిగిన ఆహ్వానపత్రికను తయారు చేయించారు. కూరగాయల విత్తనాలను అందులో పొందుపరిచారు. ఈ పత్రికను నాటండని కోరుతూ... ప్రేమను సాగు చేయండని విజ్ఞప్తి చేశారు.తన వివాహానికి రావాలని కోరుతూ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి శశికాంత్ ఆహ్వానపత్రికను అందించారు.
విత్తనాలు పొదిగిన పెళ్లి పత్రిక.. సీఎం కేసీఆర్‌కి ఆహ్వానం! - ప్రగతి భవన్
పెళ్లికి ముహూర్తం ఎంత ముఖ్యమో.. దానికి సంబంధించిన పత్రికలు అంతే ముఖ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని ఆలోచిస్తుంది నేటి యువత. సాంకేతిక పెరుగుతున్న కొద్దీ దానిని వినియోగించుకుంటూ సరికొత్తగా, వినూత్నంగా పత్రికలు అచ్చు వేయించుకుంటున్నారు. అలాంటి కొన్ని పత్రికలని ఈ మధ్య కాలంలో చూశాం. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి తన వివాహానికి పర్యావరణ హితం సందేశాన్ని పంపుతూ పత్రిక అచ్చు వేయించారు. అదేంటో చూద్దాం.
పెళ్లిపత్రికలు రకరకాలుగా రూపొందిస్తుంటారు. కొందరు విభిన్నంగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో రైల్వేశాఖ ఉన్నతాధికారి శశికాంత్ మరికాస్త వైవిధ్యంగా ఆలోచించారు. పర్యావరణహితం, పచ్చదనాన్ని దృష్టిలో ఉంచుకొని తన వివాహానికి విత్తనాలు పొదిగిన ఆహ్వానపత్రికను తయారు చేయించారు. కూరగాయల విత్తనాలను అందులో పొందుపరిచారు. ఈ పత్రికను నాటండని కోరుతూ... ప్రేమను సాగు చేయండని విజ్ఞప్తి చేశారు.తన వివాహానికి రావాలని కోరుతూ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కి శశికాంత్ ఆహ్వానపత్రికను అందించారు.
ఇదీ చదవండి:దూసుకొస్తున్న నివర్...ఎటు వెళ్తుందంటే?