ప్రధాని మోదీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలుతో ఆర్థిక పరిణామాలను అంచనా వేయవచ్చని ప్రముఖ ఆర్థిక నిపుణులు అనంత్ అభిప్రాయపడ్డారు. ప్యాకేజీలో భాగంగా బ్యాంకులకు అధిక నిధులను కేటాయించాలని అన్నారు. వాటిని రక్షించుకుంటేనే ఆర్థిక రంగం ముందుకెళ్తుందని వ్యాఖ్యానించారు. పన్నులు, అప్పుల రూపంలో ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉచిత పథకాలు ఇచ్చినా...అప్పు, పన్నుల రూపంలో తీసుకోవాల్సిందేని పేర్కొన్నారు. ఉచిత పథకాలు కొనసాగిస్తే ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం మనగలిగే పరిస్థితి ఉండదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకుని జాగ్రత్తగా ముందుకెళ్లాలని సూచించారు.
దేశంలో డిమాండ్, సప్లయ్ సమస్యలు వచ్చాయి. ఆర్థిక కార్యకలాపాలు సున్నాకు పడిపోయాయి. ఎవరికి, ఏ రూపంలో ఉద్దీపన ఇవ్వాలనే దానిపై ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాలు కూడా స్వదేశీ అనుకుంటే మనకు పెట్టుబడులు రావు. ప్రభుత్వం ఒప్పందాలు సరిగా అమలు చేస్తేనే పెట్టుబడులు వస్తాయి.
- ఆర్థిక నిపుణులు అనంత్
ఇదీ చదవండి :