ETV Bharat / city

ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్​లో వాళ్లే ! - ఇంటర్ 2022 ఫలితాలు

ఇంటర్ ఫలితాలు విడుదల
ఇంటర్ ఫలితాలు విడుదల
author img

By

Published : Jun 22, 2022, 12:51 PM IST

Updated : Jun 22, 2022, 3:30 PM IST

12:48 June 22

ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స

ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 54, రెండో సంవత్సరంలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని.. విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడించారు. ఉత్తీర్ణత శాతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తొలిస్థానంలో ఉండగా.. ఉమ్మడి కడప జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈనెల 25 నుంచి జులై 5 వరకు రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు.

  • ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 2,41,591 మంది ఉత్తీర్ణత (54 శాతం)
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 2,58,449 మంది ఉత్తీర్ణత (61 శాతం)
  • ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో బాలురు 49, బాలికలు 65 శాతం ఉత్తీర్ణత
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో బాలురు 59, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత
  • అత్యధికంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణత
  • అత్యల్పంగా ఉమ్మడి కడప జిల్లాలో 55 శాతం మంది ఉత్తీర్ణత

గత ఐదేళ్లలో ఫలితాల హెచ్చుతగ్గుదలను విశ్లేషించిన మంత్రి బొత్స.. ఇప్పటి నుంచి మెరుగైన ఫలితాలు ప్రారంభమైనట్లుగా భావించాలని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజీ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయంగా పేర్కొన్నారు. 884 హైస్కూల్స్​ను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని, వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్‌ నిర్వహించినందున.., అవసరమైతేనే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల క్రమబద్దీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గబోమని చెప్పారు.

ఇవీ చూడండి :

Last Updated : Jun 22, 2022, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.