ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శికి నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఉద్యోగాల్లో ట్రాన్స్ జెంటర్లకు రిజర్వేషన్లు కల్పించకపోవడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ కర్నూలు జిల్లాకు చెందిన మహిమ అనే యువతి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సాల్మరాజు వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి: