weather updates: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశా కదులుతోందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. గడచిన 6 గంటలుగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోందని తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఈశాన్యంగా 230 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 90 కిలోమీటర్ల, పూరి కి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. మధ్యాహ్నానికి పూరికి దగ్గరగా వాయుగుండం వెళ్తుందని..., సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. రాగల 12 గంటల్లో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం గా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: Free Fire Game: సెల్ఫోన్ తెచ్చిన తంటా..నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు