ETV Bharat / city

తెలంగాణలో... కరోనా రోగులకు ఆక్సిజన్ పడకల కొరత - తెలంగాణ తాజా వార్తలు

కరోనా ఊపిరితిత్తుల్లో చేరి ఉసురు తీసే మహమ్మారి. లక్షణాలు లేని వారిలో పెద్దగా ప్రభావం చూపకపోయినా... కొందరిలో మాత్రం తీవ్రరూపు దాలుస్తోంది. ఆక్సిజన్ లేకపోతే క్షణాల్లోనే ఆయువు తీసేస్తోంది. కొవిడ్ రెండో వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో... తెలంగాణలో ఆక్సిజన్ పడకల కొరత పెరిగింది. హైదరాబాద్‌ సహా జిల్లాల్లోనూ ఆక్సిజన్ పడకలు దొరకని పరిస్థితి నెలకొంటున్న తీరుపై కథనం.

oxygen beds shortage
ఆక్సిజన్ పడకల కొరత
author img

By

Published : Apr 17, 2021, 9:50 AM IST

కరోనా వైరస్ లక్షణాలు పెరిగిన వారికి ఆక్సిజన్ తప్పనిసరన్న.. డబ్ల్యూహెచ్​ఓ సూచనల మేరకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గతేడాది మార్చి నుంచి వైరస్ కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం ... 22 ప్రభుత్వాసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్‌లను ఏర్పాటు చేసింది. 6,044 ఆక్సిజన్ పడకలను కొవిడ్ రోగుల కోసం కేటాయించింది. మరో 1,707 ఐసీయూ పడకలు సైతం అందుబాటులో ఉంచింది. ప్రైవేటులోనూ 5,813 ఆక్సిజన్ పడకలు కేటాయించింది.

ఖాళీగా ఉన్నవి తక్కువ

ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 11,857 ఆక్సిజన్ పడకలను... కొవిడ్ రోగుల కోసం కేటాయించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో కొవిడ్ రెండో దశ విజృంభిస్తుండటం.. అందులోనూ లక్షణాలు ఉన్నవారిలో అత్యధికులకు ఆక్సిజన్ అవసరమవుతున్నందున రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ పడకలు వేగంగా నిండుకుంటున్నాయి. ముఖ్యంగా జీహెచ్​ఎంసీతోపాటు నిజమాబాద్ జిల్లాలో ఆక్సిజన్ పడకలకు కొరత ఏర్పడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలోని 6,044 ఆక్సిజన్ పడకలకుగాను 4,401 అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 5,813 ఆక్సిజన్ పడకలను కేటాయించగా... అందులో ఇప్పటికే 3,294 పడకలు పూర్తి కాగా... ఖాళీగా ఉన్నవి కేవలం 2,519 మాత్రమే. ప్రైవేటులో దాదాపు 57 శాతం పడకలు ఇప్పటికే నిండుకున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి కేవలం 58 శాతం పడకలు మాత్రమే ప్రస్తుతం ఖాళీగా ఉండగా... గడిచిన పది రోజుల్లోనే సుమారు 40 శాతం పడకలు నిండుకోవటం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి: అలెర్ట్: కనుగుడ్డు నుంచీ శరీరంలోకి వెళ్తున్న వైరస్‌

నిజామాబాద్‌లో ఎక్కువ..

నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్లలో దాదాపు ఆక్సిజన్ పడకలు నిండుకున్నాయి. సిరిసిల్లలో 40 ఆక్సిజన్, 10 ఐసీయూ పడకలు కొవిడ్ రోగులకు కేటాయించగా.. మొత్తం అన్ని నిండుకున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ పడకలు కేటాయించకపోవటం గమనార్హం. ఫలితంగా కొత్తగా ఎవరికైనా ఆక్సిజన్ పడకలు కావాలంటే... ఉన్నవారు కోలుకోవాలి లేదా చుట్టుపక్కల జిల్లాలకు తరలించాల్సిన పరిస్థితి. నిజామాబాద్‌లో కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అవసరంతో వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. నిజామాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రుల్లో 226 ఆక్సిజన్ పడకలు కేటాయించగా అందులో 57మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో అయితే 103 ఆక్సిజన్ పడకలకు... కేవలం 7 మాత్రమే అందుబాటులో ఉన్నాయంటే నిజామాబాద్‌లో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

పడకలకు భారీగా డిమాండ్

జీహెచ్​ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,248 ఆక్సిజన్ పడకలకు 1,541 పడకలు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటులో మాత్రం 1,938 పడకలకు... అందుబాటులో ఉన్నది కేవలం 448 పడకలు మాత్రమే. అవి కూడా చిన్నాచితకా ఆస్పత్రుల్లో మిగిలి ఉన్నాయి. ఫలితంగా పెద్దాస్పత్రుల్లో ఆక్సిజన్ పడకలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. కింగ్‌కోఠి, ఈఎస్​ఐ ఆస్పత్రుల్లో పూర్తిగా ఆక్సిజన్ పడకల కొరత ఏర్పడింది. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో 8 ఆక్సిజన్ పడకలకు అన్నీ నిండుకున్నాయి.

ప్రజల అప్రమత్తత అవసరం

కరీంనగర్‌లో 137 ఆక్సిజన్ పడకలకు 52 ఖాళీగా ఉన్నాయి. మేడ్చల్‌లో ప్రైవేటులో 781 పడకలు ఉండగా... అందులో 209 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,272కి... 550 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఆక్సిజన్ పడకల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మరికొన్ని చోట్ల ఆక్సిజన్‌ పడకలకు భారీగా వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోకపోతే... మరో వారం పది రోజుల్లోనే కొవిడ్ రోగులకు ఆక్సిజన్ పడకలు దొరకని పరిస్థితి ఎదురుకానుంది.

ఇదీ చూడండి:

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కరోనా టీకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.