ETV Bharat / city

మేఘ కృష్ణారెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ సోదాలు - it rides on megha engineers

ప్రముఖ వ్యాపార వేత్త... మేఘ గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. నిన్న అర్ధరాత్రి నుంచే ఈ దాడులు ప్రారంభించినట్టు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.

cbi
author img

By

Published : Oct 11, 2019, 1:09 PM IST

ప్రముఖ వ్యాపార వేత్త... మేఘ గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. నిన్న అర్ధరాత్రి నుంచే ఈ దాడులు ప్రారంభించినట్టు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్​కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలు, కృష్ణారెడ్డి ఇళ్లు, అన్ని కార్యాలయాలపైనా ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మొత్తం 35 చోట్ల తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మేఘ సంస్థ భారీ కాంట్రాక్టులు పొందింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు... తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనిక పారిశ్రామిక వేత్తలుగా కృష్ణారెడ్డి సోదరులు నిలిచారు. ఇటీవల వచ్చిన లాభాల్లో లెక్కలు సరిగా చూపలేదన్న కారణంతో ఐటీశాఖ ఈ సోదాలు చేపట్టినట్లు తెలిసింది. సోదాలను ఐటీశాఖ అధికారులు ధ్రువీకరించారు. వివరాలు చెప్పటానికి నిరాకరించారు. ఐటీ శాఖలోని ఇన్వెస్టిగేషన్‌ విభాగం ఈ సోదాలు చేస్తున్నట్టు తెలిసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.