కరోనా వ్యాప్తి నేపథ్యంలో శాసన సభ నిర్వహణకు సంబంధించి పాటించాల్సిన విధివిధానాలతో కూడిన బులెటిన్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు జారీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల వెంట పీఏలు, వ్యక్తిగత సిబ్బంది, సందర్శకులను తీసుకు రావద్దని సూచనలు జారీ చేశారు. అసెంబ్లీ వెలుపల కేటాయించిన స్థలంలోనే గన్ మెన్ లు ఉండాలని స్పష్టం చేశారు.
మీడియా పాయింట్ లేదు...
కొవిడ్ దృష్ట్యా ఈసారికి మీడియా పాయింట్ ఉండబోదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సభ్యులు ఎవరూ ఆయుధాలను సభలోనికి తీసుకురావొద్దని.. ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించిన బెల్ ఆఫ్ అర్మ్ లో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. సభ్యులు ప్లకార్డులు, బ్యానర్లు కర్రలు ఇతర సామగ్రి తేవడం నిషేధమని పేర్కొన్నారు. ఈ సారి సందర్శకుల గ్యాలరీలోకి ఎవరిని అనుమతి లేదని స్పష్టం చేస్తూ బులెటిన్ విడుదల చేశారు.
ఇవీ చదవండి: ఆర్థిక ఇబ్బందులున్నా పద్దు భారీగానే.. 2.60 లక్షల కోట్లు..!