కోడి పెంట మాటున..
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమ మద్యం రవాణాకు అడ్డుపడటంలేదు. అక్రమార్కులు కొత్త కొత్త మార్గాల్లో మద్యం తరలిస్తూ పట్టుపడుతున్నారు. కోళ్ల వ్యర్థాలు మాటున తరలిస్తున్న 133 కర్ణాటక మద్యం బాటిళ్లను నెల్లూరు జిల్లా కోవూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు. మద్యం తరలిస్తున్న వారు పరారవ్వగా, మద్యాన్ని, వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సెబ్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులో...
కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద సెబ్ అధికారులు తెలంగాణ మద్యం పట్టుకున్నారు. కర్నూలు సంతోష్‌నగర్‌కు చెందిన మహబూబ్ బాషా ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులో మద్యం తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలు, ఆటోను సెబ్ అధికారులు సీజ్ చేశారు.
బెల్లం ఊట ధ్వంసం..
ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని నాటు సారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేసిన అధికారులు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంస చేశారు. 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: suhasini case: సుహాసిని కేసులో మరో ట్విస్ట్.. తెరపైకి రెండో భర్త