తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో తలెత్తిన ఘటనపై ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ స్పందించారు. చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పోలీసులకు సంబంధం లేదని అన్నారు.
ఐజీ స్పందన ఆయన మాటల్లోనే
"పర్యటనకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు కరకట్ట నుంచి పర్యటన ప్రారంభమైంది. 10.17కు సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు కాన్వాయ్ చేరుకుంది. నిరసనకారులు బస్సుపైకి చిన్నరాయి, చెప్పును విసిరారు. లాఠీ విసిరారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మధ్యాహ్నం 2 గంటలకు అనుమతి పూర్తయినా.. సాయంత్రం 6 గంటల వరకు పర్యటించారు. లెక్కకు మించి వాహనాలు కాన్వాయ్‌లో వచ్చాయి. దాడికి పాల్పడిన వారిపై 352, 290, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. పోలీసు విధుల్లో నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటాం. దర్యాప్తులో భాగంగా బస్సును సీజ్ చేశాం. బస్సు అద్దం కొంతమేరకు ముందే పగిలి ఉంది" అని ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ వివరించారు.
ఇవీ చదవండి: