ETV Bharat / city

ఇంటి అద్దె భత్యం 2022 జూన్ వరకు పొడిగింపు - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వార్తలు

అమరావతి రాజధాని పరిధిలో పని చేస్తున్న రాష్ట్ర కేడర్ చెందిన ఐఎఎస్, ఐపీఎస్ సహా అఖిల భారత సర్వీసు అధికారులకు 24 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లింపు ను 2022 జూన్ వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఐఎఎస్ అధికారుల ఇంటి భత్యం చెల్లింపు 2022 వరకు కొనసాగింపు

author img

By

Published : Feb 18, 2021, 2:05 AM IST

అమరావతి రాజధాని పరిధిలో పని చేస్తున్న రాష్ట్ర కేడర్ చెందిన ఐఎఎస్, ఐపీఎస్ సహా అఖిల భారత సర్వీసు అధికారులకు 24 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లింపును 2022 జూన్ వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి రాజధాని పరిధిలోని సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులకు ఇంటి అద్దె భత్యం చెల్లింపు ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అమరావతి రాజధాని పరిధిలో నివసిస్తున్న అఖిలభారత సర్వీసు అధికారులకు మూలవేతనంపై 24 శాతం ఇంటి అద్దె భత్యాన్ని చెల్లించేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీన్ని 2022 జూన్ వరకూ పొడిగిస్తూ ప్రస్తుతం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులకు ఇది వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. 2018 నుంచి ఇప్పటికి రెండు దఫాలు మూలవేతనంపై 24 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లింపు వెసులుబాటును ప్రభుత్వం పొడిగించింది.

ఇదీ చదవండి

ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయి : ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.