ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై మరోసారి వాయిదా కోరినందున ఖర్చుల కింద రూ.3వేలు చెల్లించాలంటూ నిందితురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి సోమవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో బౌండరీ వివాదం తేలేదాకా అక్రమ మైనింగ్ కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. వాదనలు వినిపించడానికి పలు అవకాశాలు ఇచ్చామని, ఇక వాయిదాలు ఉండవని తేల్చి చెప్పారు. తదుపరి విచారణలో వాదనలు వినిపించని పక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని, మరోసారి గడువు ఇవ్వమని తేల్చి చెబుతూ విచారణను ఈనెల 12కు వాయిదా వేశారు.
OMC Case: ఖర్చుల కింద రూ.3వేలు చెల్లించాలంటూ సీబీఐ కోర్టు ఆదేశాలు - cbi court reacted on Obulapuram mines case issue
ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై మరోసారి వాయిదా కోరినందున ఖర్చుల కింద రూ.3వేలు చెల్లించాలంటూ నిందితురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి సోమవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
![OMC Case: ఖర్చుల కింద రూ.3వేలు చెల్లించాలంటూ సీబీఐ కోర్టు ఆదేశాలు సీబీఐ కోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మీ వాదనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12365737-871-12365737-1625501223449.jpg?imwidth=3840)
ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై మరోసారి వాయిదా కోరినందున ఖర్చుల కింద రూ.3వేలు చెల్లించాలంటూ నిందితురాలైన ఏపీ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి సోమవారం సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో బౌండరీ వివాదం తేలేదాకా అక్రమ మైనింగ్ కేసు విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినట్లు శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని సీబీఐ చెప్పిందని గుర్తు చేశారు. వాదనలు వినిపించడానికి పలు అవకాశాలు ఇచ్చామని, ఇక వాయిదాలు ఉండవని తేల్చి చెప్పారు. తదుపరి విచారణలో వాదనలు వినిపించని పక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని, మరోసారి గడువు ఇవ్వమని తేల్చి చెబుతూ విచారణను ఈనెల 12కు వాయిదా వేశారు.
TAGGED:
Obulapuram mines case