ETV Bharat / city

" ట్రాఫిక్ రూల్స్ మీకే.. మాక్కాదు..!" - Cyberabad Traffic Police

Traffic Police Violating Rules: హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు తమ వాహనాలు ఎలా వెళ్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. సాధారణ ప్రజలపై చలాన్ల పేరిట జరిమానాలు విధించే ట్రాఫిక్ అధికారులు.. 'రూల్స్ మీకే.. మాక్కాదు' అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వాహనదారుల నుంచి వినిపిస్తున్నాయి.

TRAFFIC RULES
పోలీసుల ట్రాఫిక్ ఉల్లంఘనలు
author img

By

Published : Jun 3, 2022, 9:46 AM IST

Traffic Police Violating Rules : తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చట్టాలు తీసుకొచ్చారు. కొద్దిరోజుల వరకు చలాన్లు విధిస్తూ.. కేసులు పెడుతూ.. వాహనదారుల్లో భయం పుట్టించారు. ఈ చట్టాలు ఇలాగే అమలైతే.. తెలంగాణలో ఇక రోడ్లపై నెత్తురు ప్రవహించదని అందరు గట్టిగా నమ్మారు. కానీ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం ఆ టార్గెట్​ని చేరనీయడం లేదు. ముఖ్యంగా నిబంధనలు సాధారణ ప్రజలకే.. తమకు కాదన్నట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

రహదారులపై రాంగ్‌రూట్​లో వెళ్లే వాహనదారులకు రూ.1,100 చలానా విధిస్తున్న పోలీసులు తమ వాహనాలు మాత్రం ఎలా వెళ్లినా కన్నెత్తి చూడరు. గురువారం ఉదయం సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగా ఓ పోలీసు వాహనం రాంగ్‌రూట్లో వెళుతుండటమే అందుకు నిదర్శనం. మరోవైపు.. ఓ ద్విచక్రవాహనదారుడు తాజ్‌డెక్కన్‌ కూడలిలో సిగ్నల్‌ మీరి వెళుతుండగా ట్రాఫిక్‌ సిబ్బంది ముచ్చట్లలో మునిగి కనిపించారు.

ఇదీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.