.
COURT ORDERS TO FILE CASE ON KANGANA: కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయండి.. నాంపల్లి కోర్టు ఆదేశం - నాంపల్లి కోర్టు తాజా వార్తలు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు.. సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. స్వాతంత్య్రంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కంగనా వ్యాఖ్యానించారని న్యాయవాది కొమిరెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది.
![COURT ORDERS TO FILE CASE ON KANGANA: కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయండి.. నాంపల్లి కోర్టు ఆదేశం KANGANA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13745766-263-13745766-1637937924471.jpg?imwidth=3840)
KANGANA
.