రాగల రెండు, మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నమ్మ తెలిపారు. ఉపరితల ఆవరణ దక్షిణ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని ఆమె తెలిపారు.
గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రత రామగుండంలో 41 డిగ్రీలు నమోదైందని ఆమె చెప్పారు. రాష్ట్రంలోని 23 జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో 40.8 డిగ్రీలు, నిజామాబాద్లో 47.5 డిగ్రీలు, రామగుండంలో 41.6 డిగ్రీలు, హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆమె తెలిపారు.
హైదరాబాద్లో కనిష్ఠంగా 22.8 డిగ్రీల సెల్సియస్, మెదక్లో అత్యల్ప ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు ఆమె పేర్కొన్నారు. రాగల 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 నుంచి 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. 22 నుంచి 24 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఆమె వివరించింది.
ఇదీ చదవండి: