ETV Bharat / city

hussen sagar హుస్సేన్‌ సాగర్‌కు కాలుష్యం కాటు.. ఈ సారి భారీగా విగ్రహాల నిమజ్జనం.. - Andhra Pradesh local news

hussain sagar: వినాయక నిమజ్జనాలు హుస్సేన్‌ సాగర్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. వేలసంఖ్యలో విగ్రహాల నీటిలో వేయటంతో కలుషిత రసాయనాలు కలిశాయి. ఇందులో నీటి నాణ్యతను పరీక్షించేందుకు కాలుష్య నియంత్రణ మండలి నమూనాలను సేకరించింది. ప్రమాదకర రసాయనాలున్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించింది. బయో, కెమికల్‌ ఆక్సిజన్ డిమాండ్‌ ఎక్కువగా ఉందని పేర్కొంది.

hussen sagar
హుస్సేన్‌ సాగర్‌ వినాయక నిమజ్జనాలు
author img

By

Published : Sep 13, 2022, 11:56 AM IST

హుస్సేన్‌ సాగర్‌ వినాయక నిమజ్జనాలు

గణేశ్‌ నిమజ్జనంతో హుస్సేన్‌ సాగర్‌ మరింత కలుషితం అయ్యింది. ఈ ఏడాది సుమారు 2 లక్షల విగ్రహాలు వేసి ఉంటారని అధికారులు అంచనా వేశారు. నీటి నాణ్యత లెక్కగట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి వేర్వేరు రోజుల్లో నమూనాలు సేకరించింది. ఎన్​టీఆర్​ గార్డెన్‌ ఎదురుగా రెండుచోట్ల, లుంబినీ పార్క్‌, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్‌ సహా బుద్ధ విగ్రహం వద్ద ఆరుచోట్ల నీటి నమూనాలు తీసుకున్నారు. నిమజ్జనానికి ముందు... ఆ తర్వాత రోజుల్లోనూ సేకరించారు.

ఇందులో బయో ఆక్సిజన్‌ డిమాండ్‌ మూడు లోపు ఉండాలి. కానీ, 30కిపైగా ఉందని ప్రాథమిక పరిశీలనలో తేలింది. కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ నాలుగుకి బదులు... 25రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. శనివారం కూడా నిమజ్జనం కొనసాగడంతో ఆదివారం నమూనాలు తీసుకున్నారు. అప్పటికీ భారీ విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వినాయక నిమజ్జనం జరిగిన మూడ్రోజులు భారీ వర్షాలు కురవడంతో వరదనీటి కాల్వలు, నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లోకి కలుషితనీరు భారీగా చేరింది. వర్షాల కారణంగా కలుషిత జలాలు కొంత పరిమాణం దిగువకు వెళ్లింది. శని,ఆదివారాల్లో నాలాల ద్వారా ప్రమాదకర రసాయనాలు సాగర్‌లోకి చేరుకున్నాయి.

గతేడాది కూడా కాలుష్య నియంత్రణమండలి పరీక్షలు నిర్వహించింది. ఎన్​టీఆర్ గార్డెన్‌ ఎదురుగా తీసుకున్న నీటి నమూనాల్లో బయో ఆక్సిజన్‌ డిమాండ్‌ అత్యధికంగా 45మిల్లీ గ్రామ్స్‌ పర్‌ లీటర్‌ ఉందని తేలింది. మరోచోట కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 199మిల్లీ గ్రామ్స్‌ పర్‌ లీటర్‌గా ఉందని గుర్తించారు. అతిభార లోహాల నమూనాలు ఎక్కువగా ఉన్నాయని పీసీబీ అధికారులు తెలిపారు. ఈసారి కూడా తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మట్టిప్రతిమలు ఎక్కువగా ఉన్నందునా... కాలుష్యం స్థాయి ఎంతుందో తుది ఫలితాల ఆధారంగా తేలనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.