ETV Bharat / city

Crop Damage in Telangana : పంట నష్టమంటే ‘లెక్క’లేదా - Crop Damage in Telangana

Crop Damage in Telangana : తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలతో అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇంత నష్టం జరిగిన వ్యవసాయాధికారులు పంట నష్టాలను అంచనా వేయడం లేదు. పరిహారం వచ్చే అవకాశాలు కనిపించక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Crop Damage in Telangana
పంట నష్టమంటే ‘లెక్క’లేదా
author img

By

Published : Jul 15, 2022, 9:20 AM IST

Crop Damage in Telangana : భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేశాయి. నీటమునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయి. నష్టపోయిన రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. అయినా.. కనీసం ఎన్ని ఎకరాల్లో పంటలు నీటమునిగాయో తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ అంచనాలు వేయడం లేదు. మరోవైపు ‘ప్రధాన మంత్రి పంటల బీమా’(పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. దీంతో పరిహారం వచ్చే అవకాశాలు కనిపించక రైతులు ఆవేదన చెందుతున్నారు.

పంటలు పూర్తిగా నాశనమై రైతులు నష్టపోయిన మాట వాస్తవమే అయినా.. వివరాలు సేకరించి పంపాలని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అందువల్ల తామేం చేయలేమని ఓ జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. తమ వద్ద ఎలాంటి వివరాలు లేనందువల్లే చెప్పలేకపోతున్నామని కమిషనర్‌ కార్యాలయ అధికారి ఒకరు వివరించారు. అయితే, రాష్ట్రంలో 10.76 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తమ అంచనాల్లో తేలినట్లు రైతుసంఘాలు చెబుతున్నాయి.

* ఒక్క ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోనే 18 మండలాల్లో 1,03,305 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు అనధికారికంగా అంచనా వేశారు. నిజామాబాద్‌లో 40 వేల ఎకరాలు, కరీంనగర్‌లో 15 వేలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని 191 గ్రామాల్లో 6493, కుమురం భీంలో 47,345, నిర్మల్‌ జిల్లాలో 20,294 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో పంటలు నీటమునిగినా వ్యవసాయాధికారులు వివరాలు వెల్లడించడం లేదు.

* పత్తి, సోయా, మొక్కజొన్న వంటి పైర్లు ప్రస్తుతం చిన్న మొక్కల దశలో ఉన్నాయని, ఎక్కువ రోజులు నీటిలో మునిగి ఉన్నా అధిక తేమను తట్టుకోలేక చనిపోతాయని సీనియర్‌ వ్యవసాయాధికారి ఒకరు చెప్పారు. ఈ పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటికి పంపేలా రైతులు చర్యలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. అధిక తేమకు తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశముందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపింది.

..

పంట పోయే.. అప్పు మిగిలే.. అధిక వర్షాలతో వచ్చిన వరదతో బేల మండలం సాంగ్వి గ్రామ శివారులోని సాత్నాల వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో సమీప పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేశాయి. మైదాన ప్రాంతాలను తలపిస్తున్నాయి. ఏర్మా భగవత్‌రావ్‌ అనే రైతు 8 ఎకరాల్లో వేసిన సోయా, పత్తి పంటలు మునిగిపోయి నాశనమయ్యాయి. రూ.లక్ష అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టానని, పంట పూర్తిగా దెబ్బతినడంతో ఎలా తిరిగి కట్టాలో తోచడం లేదని వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.