కరోనా కట్టడి చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఆ చెక్కును సీఎం జగన్కు కేసీపీ ఇండస్ట్రీస్ ప్రతినిధులు అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కూడా సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించాయి. వైకాపా నేతలు, కార్యకర్తలు కలిసి రూ.64.50 లక్షలు విరాళం అందజేశారు. ఈ చెక్కులను అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సీఎం జగన్కు అందజేశారు.
ఇవీ చదవండి: