ETV Bharat / city

తెలంగాణలో కరోనా పంజా... 15 వేలు దాటిన కేసులు - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ రాష్టంలో కరోనా మహమ్మారి పంజావిసురుతోంది. కొవిడ్ బారినపడిన బాధితుల సంఖ్య 15,000 దాటింది. ఐదు రోజుల్లో కొత్తగా ఐదు వేల కేసుల వరకు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 975 మందికి పాజిటివ్‌గా నిర్ధరించారు. జీహెచ్​ఎంసీ పరిధిలోనే భారీగా కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్కరిని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది.

huge-corona-positive-cases-registered-everyday-in-telangana-975-new-case-registered-on-monday
తెలంగాణలో 975 కేసులు నమోదు
author img

By

Published : Jun 30, 2020, 11:16 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 15 వేలు దాటింది. సోమవారం మరో 975 మందికి కరోనా సోకగా ఇప్పటివరకు మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 15,394కి చేరింది. కరోనా మహమ్మరికి సోమవారం ఆరుగురు బలయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి 253 మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 410 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... ఇప్పటి వరకు కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 5,582కి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,559గా వెల్లడించారు.

అత్యధికం అక్కడే..

తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 861 మంది వైరస్‌ బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ జిల్లాలో 20 కేసులు వెలుగుచూశాయి. సంగారెడ్డిలో14 , భద్రాద్రి కొత్తగూడెం 8 , కరీంనగర్‌లో 10 , వరంగల్‌ గ్రామీణంలో ఐదుగురు, అర్బన్‌లో నలుగురు, మహబూబ్‌నగర్‌లో ముగ్గురికి వైరస్‌ సోకింది. నల్గొండ, యాదాద్రి, కామారెడ్డిలో ఇద్దరేసి చొప్పున కొవిడ్‌ బారినపడ్డారు. ఆసిఫాబాద్‌, గద్వాల్ మహబూబాబాద్‌లో ఒక్కో కేసు నమోదైంది.

లాక్​డౌన్​ తర్వాతే...

తెలంగాణలో ఇప్పటివరకు 85,106 మందికి పరీక్షలు నిర్వహించగా.. 15,394మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఇందులో దాదాపు 85 శాతం కేసులు లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాతే నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇవీ చూడండి: హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.