ETV Bharat / city

RFC carnival: రామోజీ ఫిల్మ్​సిటీలో సందడి షురూ.. ఈ నెల 21 నుంచి హాలిడే కార్నివాల్‌ - holiday carnival in ramoji film city

RFC carnival: అద్భుతమైన కార్నివాల్ కలల లోకాన్ని కళ్ల ముందు ఆవిష్కరించేందుకు.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​సిటీ సిద్ధమైంది. అదిరే సెట్టింగులు, కళ్లు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్​ వర్ణ కాంతులు, చిన్నాపెద్దలకు ప్రత్యేక ఆటవిడుపు కార్యక్రమాలు.. వేసవి అలసట తెలియకుండా పసందైన విహారయాత్రను అందించేందుకు హాలిడే కార్నివాల్​ ఈ నెల 21 నుంచి ప్రారంభంకానుంది. మరి ఈ కార్నివాల్​లో పర్యాటకులకు అందించే వినోదాల గురించి మీకోసం.

holiday carnival in ramoji film city
రామోజీ ఫిల్మ్​సిటీలో హాలిడే కార్నివాల్‌
author img

By

Published : Apr 18, 2022, 12:25 PM IST

RFC carnival: ఈ వేసవి కాలంలో సెలవు రోజులను వినోదం, విహారం, సంబ్రమాశ్చర్యాల మధ్య ఆస్వాధించాలనుకొనే వారి కోసం.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో హాలిడే కార్నివాల్‌ సిద్ధమైంది. ఏప్రిల్‌ 21న ప్రారంభమయ్యే ఈ కార్నివాల్‌ జూన్‌ 5 వరకు.. 46 రోజుల పాటు కొనసాగనుంది. పర్యాటకులను అద్భుతమైన బాహుబలి సెట్‌ సందర్శన, రామోజీ స్టూడియో టూర్‌లో ప్రత్యేక ఆకర్షణలు, గార్డెన్లు, నయనానందకరంగా కొనసాగే లైవ్‌ షోలు, స్టంట్‌ షో, ఫన్‌ రైడ్‌లు, ఆబాలగోపాలాన్ని అలరించే గేమ్‌లు, అడ్వెంచర్‌లు ఇలా ఒక్కటేమిటి క్షణక్షణం ఆనందోత్సాహాల్లో మునిగితేలేలా చేస్తాయి.

హ్యాపీ స్ట్రీట్‌, కార్నివాల్‌ కోలాహలం..: హ్యాపీ స్ట్రీట్‌- సెలవు రోజుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సరదా ఆటలు, స్ట్రీట్‌ షోలు, లైవ్‌ ఫుడ్‌ కౌంటర్లు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే డీజే సందడి, అద్భుతమైన కార్నివాల్‌ కలల లోకాన్ని ఆవిష్కరిస్తుంది. నృత్యకారుల ప్రదర్శనలు, స్టిల్ట్‌ వాకర్లు, విదూషకులతో కొనసాగే కార్నివాల్‌ మర్చిపోలేని మధురమైన అనుభూతిని పంచుతుంది. సుందరమైన గార్డెన్లతో హాయిగొలిపే వాతావరణం.. ఆయా మార్గాలు వినువీధులను తలపించేలా జిగేల్‌మనిపించే ప్రత్యేక లైటింగ్‌ సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఈ హాలిడే కార్నివాల్‌లో సందర్శనకు వివిధ ప్యాకేజీలను రూపొందించారు.

holiday carnival in ramoji film city
రామోజీ ఫిల్మ్​సిటీలో కార్నివాల్​ కోలాహలం

హాలిడే కార్నివాల్‌ డే టూర్‌.. ఉదయం 9 నుంచి రాత్రి. 8 గంటల వరకు.: సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మార్గంలో సరదా కార్యకలాపాలు, మెరుపుల కార్నివాల్‌ పరేడ్‌, ప్రత్యేక సాయంత్రం వినోదాలు, ఇలా రోజంతా ఆస్వాదించవచ్ఛు మిరుమిట్లు గొలిపే వాతావరణంలో మర్చిపోలేని జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్ఛు సందర్శకులు రామోజీ ఫిల్మ్‌సిటీని నాన్‌ ఏసీ బస్సులో చుట్టిరావచ్ఛు షూటింగ్‌ లొకేషన్లు, గార్డెన్లు, రామోజీ మూవీ మ్యాజిక్‌లో షోలు, యాక్షన్‌ థియేటర్‌, స్పేస్‌ యాత్ర, ఫిల్మీ దునియా, కాంప్లిమెంటరీ రైడ్‌లు, వినోద కార్యక్రమాలు, స్పిరిట్‌ ఆఫ్‌ రామోజీ, వెల్డ్‌వెస్ట్‌ స్టంట్‌ షో, డోమ్‌ షోతో ఫిల్మ్‌సిటీ సందర్శనను ఆస్వాదించవచ్ఛు లైట్స్‌ కెమెరా యాక్షన్‌, ఎకో జోన్‌ సందర్శన, బర్డ్‌ పార్క్‌, సీతాకోక చిలుకల పార్క్‌, బోన్సాయ్‌ గార్డెన్‌, పిల్లలను అలరించే ఫండుస్థాన్‌, బోరాసుర, స్పిన్‌ చిల్లింగ్‌ వాక్‌, రెయిన్‌ డ్యాన్స్‌, బాహుబలి సెట్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది.

హాలిడే కార్నివాల్‌ స్టార్‌ ఎక్స్‌పీరియన్స్‌.. ఉ.9నుంచి రాత్రి 8 గంటల వరకు: ప్రీమియం ప్యాకేజీ షోలు, ఆకర్షణలు, బఫే లంచ్‌లకు ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీని అందిస్తుంది. సందర్శకులు ఏసీ కోచ్‌లో ఫిల్మ్‌సిటీ పర్యటన, షూటింగ్‌ లొకేషన్లు, గార్డెన్ల వీక్షణ, రామోజీ మూవీ మ్యాజిక్‌లో ప్రదర్శనలు, యాక్షన్‌ థియేటర్‌, స్పేస్‌ యాత్ర, ఫిల్మీ దునియాలో ప్రదర్శనలు, కాంప్లిమెంటరీ రైడ్స్‌, వినోద ప్రదర్శనలు, స్పిరిట్‌ ఆఫ్‌ రామోజీ, వైల్డ్‌ వెస్ట్‌ స్టంట్‌ షో, డోమ్‌ షో, లైట్స్‌ కెమెరా యాక్షన్‌, ఎకో జోన్‌ సందర్శన, బర్డ్‌ పార్క్‌, బటర్‌ఫ్లై పార్క్‌ సందర్శన, ఫండుస్థాన్‌లో పిల్లలకు పంచే వినోదం, బోరాసుర- స్పిన్‌ చిల్లింగ్‌ వాక్‌, రెయిన్‌ డ్యాన్స్‌, బాహుబలి సెట్‌ను సందర్శించవచ్ఛు ప్రత్యేకంగా అలంకరించిన వీధిలో అద్భుతమైన కార్నివాల్‌ పరేడ్‌లో పాలుపంచుకోవచ్చు, విద్యుత్‌ దీపాలంకరణతో మెరిసే వాతావరణంలో సరదా కార్యక్రమాలను ఆనందించవచ్చు.

holiday carnival in ramoji film city
రామోజీ ఫిల్మ్​సిటీలో హాలీడే కార్నివాల్

హాలిడే కార్నివాల్‌ ట్విలైట్‌ డిలైట్‌.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు: ప్రత్యేకంగా రూపొందించిన సాయంత్రం ప్యాకేజీలో సరికొత్త అనుభూతిని పొందడంతో పాటు గాలా డిన్నర్‌ ఉన్నాయి. సందర్శకులు రామోజీ మూవీ మ్యాజిక్‌, యాక్షన్‌ థియేటర్‌, స్పేస్‌ యాత్ర, ఫిల్మీ దునియా, బాహుబలి సెట్‌ సందర్శన, హ్యాపీ స్ట్రీట్‌లో సరదా కార్యకలాపాలు, కార్నివాల్‌ పరేడ్‌, ప్రత్యేక సాయంత్రం వినోదం, మిరుమిట్లు గొలిపేలా అలంకరించిన విద్యుత్‌ దీపకాంతుల మధ్య ప్రదర్శనలను ఆస్వాదించవచ్చు.

హాలిడే కార్నివాల్‌ స్టార్‌ ఎక్స్‌పీరియన్స్‌.. ఈవినింగ్‌ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 వరకు: ప్రత్యేక సాయంత్రం ప్యాకేజీలో ఏసీ కోచ్‌లో సులభతరమైన పర్యటన, సంతోషకరమైన మార్గంలో వినోదాలు, అద్భుతమైన కార్నివాల్‌ పరేడ్‌, సాయంత్రం వినోదం, జిగేల్‌ వినువీధులను తలపించే వాతావరణం, బఫే లంచ్‌ లేదా గాలా డిన్నర్‌ను ఆస్వాదించవచ్ఛు సెలెక్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో భాగవతం పౌరాణిక సెట్‌ సందర్శన, రామోజీ మూవీ మ్యాజిక్‌లో ప్రదర్శనలు, యాక్షన్‌ థియేటర్‌, స్పేస్‌ యాత్ర, ఫిల్మీ దునియా వినోద కార్యక్రమాలు, స్పిరిట్‌ ఆఫ్‌ రామోజీ, వైల్డ్‌ వెస్ట్‌ స్టంట్‌ షో, డోమ్‌ షో, లైట్స్‌ కెమెరా యాక్షన్‌, ప్రకృతి ఒడిలో పక్షుల పార్క్‌, సీతాకోక చిలుకల పార్క్‌, బోన్సాయ్‌ గార్డెన్‌, బాహుబలి చిత్రీకరణ జరిగిన సెట్‌ సందర్శన ఉంటుంది.

ఆకర్షణీయమైన విడిది ప్యాకేజీలు: రామోజీ ఫిల్మ్‌సిటీలోని లగ్జరీ హోటల్‌ సితార, కంఫర్ట్‌ హోటల్‌ తారా, బడ్జెట్‌ హోటల్‌ శాంతినికేతన్‌, వసుంధర విల్లా- ఫామ్‌ హౌస్‌, గ్రీన్స్‌ ఇన్​లలో ప్రశాంత వాతావరణంలో హాయిగా ఉండేలా విడిది సౌకర్యం ఉంటుంది. సహారా భాగస్వామ్య వసతి, సమూహాలకు అద్భుతమైన అనేక ఆకర్షణీయమైన హోటల్‌ స్టే ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. మీకు అనువైన ప్యాకేజీని ఎంచుకొని ఆనందించవచ్చు.

మరిన్ని వివరాలకు.. www.ramojifilmcity.com కు లాగిన్‌ చేయండి. లేదా 1800 120 2999 ని సంప్రదించవచ్చు

ఇదీ చదవండి:

Pre Christian objects: రుద్రమకోట... ఆదిమానవుడి ఆనవాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.