ETV Bharat / city

వర్ల రామయ్య వ్యాజ్యాన్ని కొట్టేయండి: ఎస్ఈసీ కార్యదర్శి - AP high court Latest Judgments

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో దాఖలైన వ్యాజ్యాల్లో వాదనల కోసం విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇరువైపు న్యాయవాదుల అంగీకారం మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్​ను కోర్టు ఫైల్​తో జతచేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 16, 2021, 4:37 AM IST

పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్​ఈసీ నోటిఫికేషన్ ఇచ్చిందని... తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య సింగిల్ జడ్జి వద్ద వ్యాఖ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి... ఈ నెల 8న జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ... 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్​ఈసీ దాఖలు చేసిన అప్పీల్​పై 7న విచారణ జరిపిన ధర్మాసనం... 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. ఈ వ్యాజ్యంపై లోతైన విచారణ జరిపే విషయాన్ని సింగిల్ జడ్డికి అప్పగించింది. తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది.

ఎస్​ఈసీ తరపు న్యాయవాది వివేక్​చంద్రశేఖర్ స్పందిస్తూ... తెదేపా నేత వర్ల రామయ్య చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేశామని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ప్రతిని పరిశీలన నిమిత్తం తమ ముందు ఉంచాలని స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాలని, ఎస్​ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ.. జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్​ఈసీని ఆదేశించారు. ఇదే అంశంపై భాజపా నేత పాతూరి నాగభూషణం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సైతం ప్రస్తుత వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్త్రీని ఆదేశించారు. విచారణను వాయిదా వేశారు.

ధర్మాసనం అనుమతి ఇవ్వడంతో... ఎన్నికలు నిర్వహించామని ఎస్​ఈసీ తరపు న్యాయవాది వాదించారు. 1.39 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని కోర్టుకు తెలిపారు. ఎంపీపీ, జడ్పీటీసీ, కోఆప్టెడ్ సభ్యులు, ఛైర్ పర్సన్, వైఎస్ ఛైర్ పర్సన్ ఎన్నికలు పూర్తిచేస్తామని చెప్పారు.

కరోనా రెండో దశ వ్యాప్తి విస్తృతమవుతోంది. అధికారులు కరోనా కట్టడి, టీకా విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంటే ఖజానాపై అదనపు భారం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతుంది. గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల కొనసాగింపులో భాగంగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో పోలింగ్ తేదీకి నాలుగు వారాలు ముందు కోడ్ విధించాల్సిన అవసరం లేదు. ఎన్నికల కోడ్ విధింపు విషయంలో విచక్షణాధికారం ఎస్​ఈసీదే. ఎన్నికలు నిలుపుదల చేయడం కోసం తెదేపా నేత వర్ల రామయ్య వ్యాజ్యం వేశారు. ఆ వ్యాజ్యాన్ని కొట్టేయండి.- కన్నబాబు, ఎస్ఈసీ కార్యదర్శి

ఇదీ చదవండీ... తిరుపతి ఉపఎన్నికకు వాలంటీర్లను దూరంగా ఉంచాలి: సీఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.