హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ విజయవాడలో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం.. ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ మర్యాదలతో దత్తాత్రేయకు మంత్రి వెల్లంపల్లి, ఈవో సురేశ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. తెలుగు ప్రజలకు దత్తాత్రేయ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. 2020లో కరోనా యావత్ ప్రపంచాన్ని కరోనా ఇబ్బందికి గురిచేసిందని అన్నారు.
హిమాచల్ గవర్నర్ ను.. రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించారు. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ సైతం.. దత్తాత్రేయను కలవనున్నారు.
ఇవీ చూడండి: