ETV Bharat / city

తవ్వింది ఎంత.. అమ్మింది ఎంత? - ఇసుక తవ్వకాల్లో తేడాలు

జిల్లాల్లో ఇసుక లెక్కల్లో వ్యత్యాసాలు రావటంతో ఏపీఎండీసీ వ్యవహారాలపై రహస్య విచారణ జరుగుతోంది. ఏయే ఇసుక రీచ్​ల నుంచి ఎంత ఇసుక తవ్వారు, నిల్వ కేంద్రాలకు ఎంత సరఫరా చేసారనే అంశాలపై విచారణ జరుగుతోంది.

variances in sand counts in districts
ఇసుక తవ్వకాల్లో తేడాలు
author img

By

Published : May 24, 2020, 8:43 AM IST

ఏపీఎండీసీలో అసలేం జరుగుతోంది?

ఆర్థిక వ్యవహారాలు, ఇసుక తవ్వకాలు, పలు నియామకాలు.. తదితర అన్ని అంశాలపై అధికారుల బృందం సమగ్రంగా విచారణ జరుపుతోంది. ముఖ్యంగా ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు ఆరంభించినప్పటినుంచి ఎన్ని రీచ్‌లను ఎంపిక చేశారు? ఎక్కడెక్కడ ఎంతెంత తవ్వకాలు చేశారు? నిల్వ కేంద్రాలకు ఎంత తరలించారు? ఎంత విక్రయాలు జరిపారు? లారీలకు ఎంత చెల్లింపులు జరిగాయి.. ఇలా అన్నింటినీ ఈ బృందం వారం రోజులుగా విచారిస్తోంది. గనులశాఖ అధికారులను విచారణ బృందంలో నియమించడంతో వారు ఆ సంస్థ నుంచి సమాచారం తీసుకొని పూర్తిగా పరిశీలిస్తున్నారు. గతేడాది సెప్టెంబరులో గనులశాఖ ఎండీగా ఓ అధికారి నియమితులుకాగా, ఇటీవల ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేశారు. గనులశాఖ సంచాలకులు వెంకటరెడ్డికే ఇన్‌ఛార్జ్‌ ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఈ సంస్థలో జరిగిన వ్యవహారాలన్నింటిపై దృష్టిపెట్టారు.

ఇసుక రీచ్‌లు, నిల్వకేంద్రాల్లో పనిచేసేందుకు 2 వేల మందికిపైగా నియమించినట్లు తెలిసింది. ఇందులో వందల మంది అదనంగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీరిని తొలగించాలని, ఇంతమందిని ఎందుకు నియమించి, సంస్థ నిధులు వృథా చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.

  • ఇసుక డోర్‌ డెలివరీకి లారీల యజమానులతో సమన్వయం చేసుకోవడానికి మొన్నటి వరకు ఓ వ్యక్తి అనధికారికంగా పనిచేశారు. అంతా తానై నడిపారు. జిల్లాల్లో జరిగే సమావేశాలకూ హాజరయ్యేవారు. కొత్త ఎండీ రాకతో ఆయన్ను పక్కనపెట్టారు.
  • ప్రతి జిల్లాలోనూ ఏపీఎండీసీ తరఫున జిల్లా ఇసుక అధికారు(డీఎస్‌వో)లుగా పొరుగు సేవల సిబ్బంది ఉండేవారు. అంతా వారి ఇష్టారాజ్యంగా ఉండేది. తాజాగా గనులశాఖ నుంచి ఏడీలు, డీడీలను ఆ పోస్టుల్లో నియమించారు. గత డీఎస్‌వోలు ఉన్నపుడు ఏం జరిగిందనేది వీరు పరిశీలిస్తున్నారు.
  • గుంటూరు జిల్లా కొల్లిపొర మండలంలోని ఓ పట్టా భూమిలో ఇసుక తవ్వకాలు జరిపారు. అక్కడ తవ్వి తీసిన ఇసుకకు, నిల్వ కేంద్రాలకు తరలించిన దానికి దాదాపు 30వేల టన్నులకు పైగా తేడా కనిపిస్తోంది. దీనిపై ఆ జిల్లాకు చెందిన గనులశాఖ అధికారి విచారించి జరిపి అక్రమం నిజమేనని గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గనులశాఖ, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
  • ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయంలో ఏ అంతస్తుకు వెళ్లినా పెద్దసంఖ్యలో సిబ్బంది కనిపిస్తారు. వీరంతా కొన్నినెలల కిందట నియమితులైన పొరుగు సేవల సిబ్బందే. సిఫార్సుతో వచ్చినవారందరికీ ఇక్కడ కొలువులిచ్చారనే ఆరోపణలున్నాయి. వీరిలో పదిశాతం మందికి కూడా అక్కడ పని ఉండదు. ఇలా కొత్తగా 200 మందికిపైగా నియమించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: టమాటా రైతులకు మిగిలింది కంట కన్నీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.