ETV Bharat / city

Corona Effect: కాడెద్దులుగా మారిన ఉన్నత విద్యావంతులు

కరోనా కరాళ నృత్యానికి.. సజీవ సాక్ష్యం ఈ దృశ్యం. మహమ్మారి విజృంభణకు ముందు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసినవారు.. వైరస్​ విలయతాండవానికి.. కాడెద్దులుగా మారాల్సి దుస్థితి వచ్చింది.

kadedlu
kadedlu
author img

By

Published : Jul 6, 2021, 10:21 AM IST

కరోనా మహమ్మారి.. ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కన్న పేగు బంధాలను కర్కశంగా తెంచేసింది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం మోపింది. వారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది. లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రైవేటు సంస్థల్లో లక్షలాది రూపాయలు వేతనం తీసుకున్న వారూ కొలువులు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తున్నవారు కొందరైతే.. సొంతూరుకు వెళ్లి పొలం బాట పట్టినవారు మరికొందరు.

తెలంగాణ ములుగు జిల్లా మంగపేట మండలం దోమెడలో గుండెలు పిండుతున్న దృశ్యం ఒకటి కంటపడింది. బీఎస్సీ, బీఈడీ, పీజీ చేసిన ఇద్దరు అన్నదమ్ములు కాడెద్దులుగా మారిన దృశ్యమిది. కరోనా రక్కసి ఛేష్టలకు.. జన జీవితాలు ఎంతటి దుర్భరంగా మారాయో ఈ దృశ్యమే సజీవ సాక్ష్యం.

ములుగు జిల్లా దోమెడకు చెందిన ఈ ఉన్నత విద్యావంతులు.. కరోనాకు ముందు హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కొవిడ్​ ప్రభావంతో కొలువులు కోల్పోయారు. ఫలితంగా ఇంటిబాట పట్టారు. వీరికి ఎకరన్నర పొలం ఉంది. పొలాన్ని చదును చేసేందుకు కాడెద్దులు లేక.. ట్రాక్టర్​తో చేయించే స్తోమత లేక.. అన్నదమ్ములే కాడెద్దులుగా మారారు. తండ్రు నాగలి గొర్రు పట్టుకోగా.. కొడుకులిద్దరూ కాడెద్దులుగా మారి నారుమడిని చదును చేశారు.

ఇటీవల కాలంలో తన కాడెద్దులు మృతిచెందాయని.. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కుమారులతో ఇలాంటి పనులు చేయించాల్సి వస్తోందంటూ.. తండ్రి సమ్మయ్య వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: NGT: రిజర్వాయర్ల నిర్మాణ వివాదంపై జోక్యం చేసుకోలేం.. ఏపీ రైతుల పిటిషన్‌పై ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.