రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై తదుపరి విచారణ నాటికి పురోగతి లేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులపై తమకు తాము కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. గ్రామ న్యాయాలయాల చట్టం-2008 ప్రకారం రాష్ట్రంలో న్యాయాలయాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన భిక్షం అనే వ్యక్తి 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారం కేబినెట్ ముందు ఉందని చెప్పారు. మంత్రి మండలి నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ... తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేశారని గుర్తు చేసింది. జాప్యం చేయటం తగదని హితవు పలికింది. తదుపరి విచారణ నాటికి పురోగతి లేకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది.
''గ్రామ న్యాయాలయాల ఏర్పాటులో పురోగతి ఎక్కడ?'' - high court serious on ap govt, over grama courts
రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై తదుపరి విచారణ నాటికి పురోగతి లేకపోతే సుమోటో కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ కోర్టులు ఏర్పాటు చేశారని గుర్తు చేసింది. ఏపీలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటులో జాప్యం తగదని హితవు పలికింది.
రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై తదుపరి విచారణ నాటికి పురోగతి లేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులపై తమకు తాము కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. గ్రామ న్యాయాలయాల చట్టం-2008 ప్రకారం రాష్ట్రంలో న్యాయాలయాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన భిక్షం అనే వ్యక్తి 2018లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ... ఈ వ్యవహారం కేబినెట్ ముందు ఉందని చెప్పారు. మంత్రి మండలి నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ... తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేశారని గుర్తు చేసింది. జాప్యం చేయటం తగదని హితవు పలికింది. తదుపరి విచారణ నాటికి పురోగతి లేకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది.
Body:నరసన్నపేట
Conclusion:9440319788