ETV Bharat / city

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు: తెలంగాణ హైకోర్టు - వినాయక చవితి వేడుకలు తాజా వార్తలు

గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

author img

By

Published : Sep 9, 2021, 11:03 AM IST

Updated : Sep 9, 2021, 12:18 PM IST

11:01 September 09

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్​ విగ్రహాల నిమజ్జనం..

హైదరాబాద్​లోని​ హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పలు ఆంక్షలు విధించింది. ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని.. ప్రత్యేక కుంటల్లో నిమజ్జనం చేయాలని హైకోర్టు సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి నిమజ్జనం చేయాలని తెలిపింది. ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలన్న ఉన్నత న్యాయస్థానం.. ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని సూచించింది. మండపాల వద్ద ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని.. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని తెలిపింది. రాత్రి 10 గంటల తర్వాత మైకులను అనుమతించొద్దన్న హైకోర్టు.. నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని పేర్కొంది. రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 

SHOCK: కాకా హోటల్​... రూ.21 కోట్ల కరెంట్​ బిల్లు..

Last Updated : Sep 9, 2021, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.