హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల ప్రకారం పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు బకాయిలను చెల్లించాలని.....రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ.. హైకోర్టు ధర్మాసనం కీలక ఉత్తర్వులిచ్చింది. మొదటి త్రైమాసిక బకాయిలను మే నెలాఖరులోగా చెల్లిస్తామని గతంలోనే హైకోర్టుకు హామీ ఇచ్చినా.... ఇప్పటి వరకు చెల్లించలేదని ఆక్షేపించింది . 9 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం సరికాదని పేర్కొంది. నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని డిస్కంల తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు.
బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. న్యాయస్థానం నుంచి ఆదేశాలు అవసరం లేదని.....విచారణను వాయిదా వేయాలని కోరారు. ఆ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. జూన్ వరకు ఉన్న బకాయిలను నవంబర్ 8 లోపు చెల్లించాలని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: