అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు విశాఖ జిల్లాలో ప్రభుత్వ అసైన్డ్ భూములను భూ సమీకరణ పథకం ద్వారా సేకరించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. అభివృద్ధి చేసిన ఫ్లాట్లను పొందేందుకు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన వారి నుంచి భూమి సమీకరించే అధికారం విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థకు ఉందని... అలా ఇవ్వనివారి నుంచి సమీకరించడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
విశాఖ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం విశాఖ డివిజన్‌లో 9 మండలాలు, అనకాపల్లి మండలంలో 54 గ్రామాల పరిధిలో 6వేల 116 ఎకరాల భూముల్ని సమీకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా సమీకరిస్తున్నారంటూ భూసేకరణ ల్యాండ్‌పూలింగ్ రైతుకూలీ నిర్వాసితుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ హైకోర్టులో పిల్ వేశారు. సమీకరిస్తున్న భూమిలో ఎక్కువ శాతం అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. 2020 మార్చి 23న పిల్‌ను విచారించిన ధర్మాసనం భూములను స్వాధీనం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల తుది విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. ఆ వ్యాజ్యాన్ని కొట్టేసింది.
ఇదీ చదవండి:
కొవిడ్ సెంటర్లకు ఆహార బిల్లుల చెల్లింపులు.. హైకోర్టుకు హాజరైన అనిల్ సింఘాల్