ETV Bharat / city

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై.. ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు - ts rtc strike latest news

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేబర్‌ కమిషనర్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సమ్మె చట్టబద్ధమా.. చట్ట వ్యతిరేకమా అని నిర్ణయించే అధికారం కార్మిక న్యాయస్థానానికే ఉందని ధర్మాసనం తేల్చి చెప్పింది.

high-court-on-rtc-strike-in-hyderabad
author img

By

Published : Nov 18, 2019, 11:27 PM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ముగిసిన వాదనలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ ముగిసింది. సమ్మెపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ లేబర్‌ కమిషనర్‌ను న్యాయస్థానం ఆదేశించింది. సమ్మె చట్టబద్ధమా.. చట్ట వ్యతిరేకమా అని నిర్ణయించే అధికారం కార్మిక న్యాయస్థానానికే ఉందని ధర్మాసనం తేల్చిచెప్పింది. చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తేల్చిన హైకోర్టు... చర్చలు స్వచ్ఛందంగా, సామరస్యంగా జరగాలని ఆకాంక్షించింది.

చట్ట విరుద్ధమని చెప్పలేము

సమ్మె చట్ట విరుద్ధమని వాదించిన అడిషనల్ ఏజీ రాంచందర్ రావు.. సమ్మెకు వెళ్లే ముందు కార్మికులు నోటీసు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత కనీసం ఆరు వారాలు ఆర్టీసీ నిర్ణయం కోసం ఎదురు చూడాలని వాదించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కమిటీ వేయడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. స్పందించిన న్యాయస్థానం సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే హక్కు ఎవరికి ఉందని అదనపు ఏజీని ప్రశ్నించింది. సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ముగిసిన వాదనలు

ప్రభుత్వానికి అనుకూలంగా అఫిడవిట్​

ఆర్టీసీ ఎండీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఐకాస ఆర్టీసీ ఐకాస తరఫు న్యాయవాది ప్రకాష్‌రెడ్డి వాదించారు. కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. వారందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికుల గురించి కార్మికశాఖ న్యాయస్థానం చూసుకుంటుందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.