ETV Bharat / city

'జీవోలన్నీ వెబ్​సైట్​లో ఉంచేలా ఆదేశాలివ్వండి' - ప్రభుత్వ జీవోలపై హైకోర్టు

ప్రభుత్వ ఉత్తర్వులను ఇకపై వెబ్​సైట్​లో ఉంచకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఆగస్టు 15న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు సీహెచ్ కృష్ణాంజనేయులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు . జీఏడి ముఖ్యకార్యదర్శి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

high court on gos
high court on gos
author img

By

Published : Aug 25, 2021, 7:35 AM IST

ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్​సైట్​లో ఉంచొద్దంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజెఎఫ్) అధ్యక్షుడు కృష్ణాంజనేయులు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వ జీవోలను ఆన్​లైన్​లో ఉంచడం 1990 నుంచి కొనసాగుతోందని వ్యాజ్యంలో తెలిపారు. సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా 2008 నుంచి పూర్తి స్థాయిలో పారదర్శకంగా జీవోలను ఆన్‌లైన్​లో ఉంచుతున్నారన్నారు. గత ప్రభుత్వం సైతం ఈ విధానాన్ని కొనసాగించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం జీవోలను వెబ్ సైట్​లో ఉంచకూడదని నిర్ణయించిందన్నారు. ఈ వ్యవహారమై అన్ని శాఖలకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నోట్​ను పంపించారని చెప్పారు. మరో నోట్ పంపుతూ జీవోల విషయమై మూడు రిజిస్టర్లను నిర్వహించాలని చెప్పినట్లు గుర్తుచేశారు. సహచట్టం సెక్షన్ 4 (1)(బి) ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని విస్తృతంగా ప్రజా బాహుళ్యంలో ఉంచాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ప్రజాసంస్థలకు ఈ విషయంలో బాధ్యతలను విధించింది. తమకు తాముగా ప్రజాసంస్థలు వివరాలు వెల్లడి చేయాలని తెలిపిందన్నారు. భద్రత, నిఘా తదితర వ్యవహారాలకు సంబంధించిన అంశాలు తప్ప ఇతర ఏ జీవోలైనా ప్రజాపత్రాలే, సహ చట్టం సైతం ఆ పత్రాలన్నింటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేస్తోందన్నారు. ఆగస్టు నుంచి ప్రభుత్వం బ్లాంక్ ఆర్డర్లను వెబ్ సైట్​లో ఉంచడం ప్రారంభించిందని వ్యాజ్యంలో తెలిపారు. ఈ విధంగా 60 జీవోలు ఇచ్చారన్నారు. ఆగస్టు 17 నుంచి వెబ్ సైట్​లో జీవోలను అప్​లోడ్​ చేయడం పూర్తిగా నిలిపేశారని తెలిపారు.

జీఏడి ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ప్రొసీడింగ్స్​ను రద్దు చేయాలని అభ్యర్థించారు. జీవోలన్నింటినీ వెబ్ సైట్​లో అప్​లోడ్ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. జీవోలను వెబ్​సైట్లో ఉంచేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

ఇదీ చదవండి: jagan cbi case: అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని.. సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.