ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ అధికారిక విధుల్లో జోక్యం చేసుకోవద్దని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విధులు అడ్డుకున్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఛైర్మన్‌కు వెసులుబాటు ఇచ్చింది. ఏపీపీఎస్సీ ఇంఛార్జీ ఛైర్మన్ రంగజనార్దన నియామకాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని, ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయుల నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ... ఉదయభాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఇంఛార్జీ ఛైర్మన్ నియామక ఉత్తర్వులను ఇటీవలే నిలిపివేసింది.
ఇవీ చూడండి: