విజయవాడ మాచవరం పరిధిలో తమకు చెందిన 5.10 ఎకరాల భూమిని అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ రాష్ట్ర ప్రణాళిక బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపింది . ఈ వ్యాజ్యంలో ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు ఆ భూమిపై ఇతరులకు హక్కు కల్పించొద్దని అధికారులను ఆదేశించింది. ప్రతివాదులకు అందుకు
సంబంధించిన నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి :హామీలేమయ్యాయ్ సీఎం గారూ..!: లోకేశ్