HIGH COURT ON RAJADHANI FARMERS PETITION : రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయటం లేదని దాఖలైన పిటీషన్‌లపై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసిందని ఏజీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నవంబర్ మొదటివారంలో విచారణ జరిగే అవకాశం ఉందని వివరించి విచారణ వాయిదా వేయాలని కోరారు. సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్నందున సీఆర్డీఏ అమల్లో ఉంటుందని రైతుల తరుపు న్యాయవాది మురళీధర్ తెలిపారు. సీఆర్డీయే నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసే విధంగా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. సుప్రీంకోర్టు విచారణ తర్వాత దీన్ని విచారిస్తామని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
ఇవీ చదవండి: