పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తులో పురోగతి లేకపోతే ఫిర్యాదుదారు హైకోర్టును ఆశ్రయించవచ్చని..అంతే తప్ప ఈ వ్యవహారంపై మీరు ఎలా పిల్ దాఖలు చేస్తారని తితిదేపై 2019లో ఓ పత్రిక ప్రచురించిన కథనంపై కేసులో...రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి, మరో పిటిషనర్ న్యాయవాది సత్యసభర్వాల్ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈకేసుపై విచారణ జరిపింది. తితిదేపై ఓ పత్రిక ప్రచురించిన కథనంపై తితిదే విజిలెన్స్ కమిషనరు..ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుపతి తూర్పు ఠాణాలో 2019 డిసెంబరు 14న ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నమోదు చేసినా దర్యాప్తులో పురోగతి లేదంటూ ఎంపీ సుబ్రమణ్యస్వామి, న్యాయవాది సత్య సబర్వాల్ ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు.
బుధవారం దీనిపై విచారణ సందర్భంగా..మీరెలా పిల్ వేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. లక్షలాధి భక్తులు విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి పిల్ దాఖలు చేశామని న్యాయవాది సత్యసబర్వాల్ తెలిపారు. ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని..ఆయన వాదనలు వినిపిస్తారని చెప్పారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: